ఆర్మూర్, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా రేగుల్ల రజినీకాంత్, మహిళ విభాగం అధ్యక్షులుగా మీర గంగా, రైతు విభాగం అధ్యక్షులుగా మామిడి రాంరెడ్డి, యువజన విభాగం అధ్యక్షులుగా పిట్టెల అఖిల్, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా జాప సంతోష్, బీసీ సెల్ అధ్యక్షులుగా కుమ్మరి రఘుపతి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అతి పెద్ద రాజకీయ పార్టీ అయిన టీఆర్ఎస్లో ఉండటం మన అందరికీ గర్వకారణమన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసిఆర్ వెంట, కేటిఆర్ వెంట, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెంట నడవటానికి ఇంటికో సైనికుడు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సర్పంచ్ కళ్లెం మోహన్, వైస్ ఎంపిపి మోతె బోజకళ చిన్నారెడ్డి, జిల్లా రైతు బంధు సమితి డైరెక్టర్ ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ చైర్మెన్ కళ్లెం భోజారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మి మల్లేష్, ఉపసర్పంచ్ దుమ్మజీ శ్రీనివాస్, గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షుడు బొప్పరం రమేష్, మాజీ అధ్యక్షుడు ఎత్తిన బోజన్న, మాజీ సర్పంచ్ నారాయణ, క్రాంతి గ్రామ టీఆర్ఎస్ నాయకులు, తదితరులున్నారు.