మనసు స్వాధీనంలో ఉండాలంటే రోజూ యోగా చేయాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన శరీరం, మనస్సు స్వాధీనంలో ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజూ రన్నింగ్‌, యోగా, మెడిటేషన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. స్వతంత్ర భారత అమృత మహోత్సవాలు కార్యక్రమాలలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుండి ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌ 2.0 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు.

ఇందిరా గాంధీ స్టేడియం నుండి చత్రపతి శివాజీ విగ్రహం, అక్కడి నుండి రాశివనం వరకు 2.0 రన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుత మన జీవన విధానంలో బిజీగా ఉంటున్నామని, మన శరీరము, మనస్సు స్వాధీనంలో ఉండాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ యోగ, మెడిటేషన్‌, రన్నింగ్‌ చేయాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు తప్పకుండా పాల్గొనాలని అన్నారు.

కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన నెహ్రూ యువ కేంద్ర తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ అన్షుమన్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ మ‌నందరిలో శారీరక శ్రమను చేసే ఉత్సాహాన్ని కలిగించడానికి ఎంతో ఉపయోగపడుతుందని, యోగా, రన్, వ్యాయామం మన నిత్య జీవితంలో భాగం కావాలని పేర్కొన్నారు.

అనంతరం విద్యార్థులు యోగా ప్రదర్శనలు నిర్వహించారు. వారికి ప్రశంసాపత్రాలు బహుకరించారు. 2.0 రన్‌లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, జిల్లా ఇన్చార్జ్‌ అదనపు కలెక్టర్‌ డి. వెంకట మాధవరావు, నిజామాబాద్‌ ఎన్‌వైకె జిల్లా యూత్‌ ఆఫీసర్‌ శైలి బెలాల్‌, జిల్లా యువజన సంక్షేమ అధికారి దామోదర్‌ రెడ్డి, జిల్లా అధికారులు, తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ సంఘం అధ్యక్షులు వెంకట్‌ రెడ్డి, ఉద్యోగులు, విద్యార్థినీ విద్యార్థులు, ఎన్‌సిసి క్యాడెట్స్‌ పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »