డిచ్పల్లి, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టార్‌గా నియమితులైన సందర్భంగా సీనియర్ ప్రొఫెసర్ పి. కనకయ్యను తెలంగాణ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, మాజీ టీయూ జేఏసీ చైర్మన్, ప్రస్తుత ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య యూనివర్సిటీ పరిపాలన భవన ప్రాంగణంలోని తన ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
కనకయ్య సార్ లాంటి అర్హులైన అధికారులు ఇలాంటి ఉన్నత పదవుల్లోకి రావడం వలన పేద విద్యార్థులకు సరైన న్యాయం జరుగుతుందని, యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందుతుందని పస్క నర్సయ్య అన్నారు. ప్రొఫెసర్ కనకయ్య ప్రతిభను గుర్తించి రిజిస్టార్‌గా నియమించిన వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రిజిస్టార్కు అభినందనలు తెలిపిన వారిలో స్వేరో టైమ్స్ సబ్ ఎడిటర్ ఎన్జీఆర్ గంగాధర్, పరిశోధక విద్యార్థులు క్రాంతి, సత్యం, రాజు, తాహెర్ తదితరులు ఉన్నారు.