సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్ఫూర్తితో ముందుకు వెళ్దాం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధా కృష్ణన్‌ స్పూర్తితో విద్యార్థులను తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధా కృష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఆదివారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

సర్వేపల్లి రాధా కృష్ణన్‌ చిత్రపటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ టీచర్స్‌ డేను జరుపుకోవడానికి కారణమైన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ దినోత్సవానికి నా పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఒక ప్రత్యేకత ఉందని ఒక మంచి టీచర్‌ ఎప్పుడూ కూడా విద్యార్థులకు దూరంగా ఉండలేడని కరోనా విపత్తు వల్ల 16 నెలలు విద్యార్థులకు దూరంగా ఉండి తిరిగి సెప్టెంబర్‌ 1 నుండి విద్యార్థులకు దగ్గర చేసిందని చెప్పారు.

16 నెలల పాటు ప్రత్యక్ష బోధనకు, విద్యార్థులకు దూరం కావడం వల్ల అందరు కూడా బాధపడి ఉంటారన్నారు. వెయ్యి మందికి కరోనా పరీక్షలు చేస్తే కూడా కేవలం 5 నుంచి 10 లోపల పాజిటివ్‌ కేసులు వస్తున్నవని వైరస్‌ ఇన్ఫెక్షన్‌ తగ్గిందని గట్టిగా చెప్పొచ్చు అన్నారు. తన విద్యార్థి తన కళ్ళ ముందు ఒక గొప్ప స్థానానికి ఎదిగితే ఆ ఉపాధ్యాయుడు గర్వంగా ఫీల్‌ అవుతాడు అని అన్నారు.

కరోనా వల్ల 16 నెలల కాలం విద్యార్థులకు వచ్చిన గ్యాప్‌ను నష్టపోయిన విజ్ఞానాన్ని ఉపాధ్యాయులు కష్టపడి అందించాలని ఇందుకు వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ అవసరం అన్నారు. కమిట్‌ మెంట్‌తో పని చేయాలని, గురువులు తలచుకుంటే ఇది చిన్న విషయమేననీ, కష్టపడి విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా ముందుకు వెళ్దామని, జిల్లా యంత్రాంగం మీకు సపోర్టుగా అన్ని రకాలుగా మీ వెనకాల ఉంటుందని భరోసా ఇచ్చారు.

రానున్న రోజుల్లో విద్యార్థులకు మంచి విద్యను అందించే వారిని గుర్తిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక బోధన అనేది గట్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం కూడా చాలా శ్రద్ధతో ఆలోచిస్తున్నదని పేర్కొన్నారు. హెచ్‌ఎంలు, టీచర్స్‌ విద్యా బోధనపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. స్కూల్‌కు కావలసిన మౌలిక సదుపాయాలు ఉంటేనే అక్కడ విద్యాబోధన మంచిగా జరుగుతుందని, ప్రతి స్కూల్లో మినిమం ఫెసిలిటీస్‌ ఇచ్చే విధంగా ముందుకు వెళ్దామని అందులో మీ పాత్ర చాలా ముఖ్యమన్నారు.

పిల్లల స్టాండర్డ్స్‌ పెరగడానికి మీ మీద చాలా గురుతర బాధ్యత ఉందన్నారు. ఈ టైంలో సరైన మార్గంలో ముందుకు వెళ్లకుంటే ఒక జనరేషన్‌ చాలా నష్టపోయే అవకాశం ఉందని, విద్యార్థులను మళ్ళీ మనం ట్రాక్‌లోకి తీసుకు రాగలిగితే సాఫీగా ముందుకు వెళ్తామన్నారు. చాలామంది విద్యార్థులు బేసిక్స్‌ కూడా మరిచిపోవడం జరిగిందని ఇన్ని నెలల గ్యాప్‌లో అది సహజమేనని అందులో ఎవరి తప్పూ లేదని మీరు మరొకసారి వారి బేసిక్స్‌ రివిజన్‌ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

రిమోట్‌ ప్రాంతాలలో పనిచేసే టీచర్‌ల వరకు కూడా ఈ మెసేజ్‌ తీసుకెళ్లాలని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు దేనికి కూడా వెనుకంజ వేయరని, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఎలాంటి నష్టం జరగలేదనే మాట ప్రజల నుండి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి రావాలని, ప్రభుత్వ ఉపాధ్యాయులు తలుచుకుంటే ప్రైవేట్‌ స్కూల్స్‌ కన్నా మంచి ఫలితాలు రాబట్ట కలుగుతారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు చిత్రా మిశ్రా, చంద్రశేఖర్‌, ట్రైని అసిస్టెంట్‌ కలెక్టర్‌ మకరంద్‌, డిఐఈఓ రఘు రాజ్‌, జడ్పీ సీఈఓ గోవింద్‌, టిఆర్‌టియు జిల్లా అధ్యక్షులు శంకర్‌, స్టేట్‌ యూనియన్‌ అధ్యక్షులు శ్రీకాంత్‌, మెప్మా పిడి రాములు, బిసి వెల్ఫేర్‌ ఆఫీసర్‌ రమేష్‌, ఏవో సుదర్శన్‌ జిల్లా అధికారులు టీచర్లు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »