కామారెడ్డి, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాగిరెడ్డిపేట్ మండల ఆత్మకూర్ గ్రామానికి చెందిన 20 మంది యువకులు బీజేపీ పార్టీని వీడి తెరాస పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
మండల జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, ఆత్మకూర్ గ్రామ ఎంపీటీసీ శ్రీనివాస్ సమక్షంలో గ్రామ యువకులు కిషన్, రవి, మహేందర్, సాయిలు, మహేష్, కే. మహేందర్, శ్రీకాంత్,రాకేష్ గౌడ్, దుర్గాదాస్, సాయిలు, చిరంజీవి, శేఖర్, కుమార్, యం.సాయిలు తదితరులు తెరాసలో చేరారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామ యువతకు వారి ఉపాధి కల్పనకు పెద్ద ప్రాధాన్యత ఇస్తుందని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పేద ప్రజల కొరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న పథకాలను ప్రజలు, యువత సంతోషంగా ఆహ్వానిస్తున్నారని అన్నారు. తెరాస పార్టీ బలోపేతానికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు.