గాంధారి, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర లబాన్ లంబాడాలను ఎస్‌టి జాబితాలో చేర్చాలని గిరిజనులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్బంగా గాంధారి మండలంలో బుధవారం పలు తండాలలో లబాన్ లంబాడా గిరిజనులు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పంపించేందు పోస్ట్ కార్డులను సేకరించారు. పోస్ట్ కార్డుల రూపంలో తమ విన్నపాన్ని, ఆవేదనను ముఖ్యమంత్రికి చేరేవిధంగా ఒకే సారి కార్డులను పంపిస్తున్నామని లబాన్ లంబాడా రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ తెలిపారు.
రాష్ట్రంలోని లబాన్ లంబాడాలను ఎస్‌టి జాబితాలో చేరుస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అయన అన్నారు. తమ విన్నపాన్ని పోస్ట్ కార్డుల పంపించడం జరిగిందన్నారు. గతంలో చెల్లప్ప కమీషన్ నివేదిక ప్రకారం లబాన్ లంబాడాలను ఎస్‌టి జాబితాలో చేర్చి 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
చెల్లప్ప కమిటీ నివేదికను వెంటనే అమలు చేయాలనీ అన్నారు. రిజర్వేషన్ వచ్చే వరకు, లాబానా కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతామని అన్నారు. అవసరమైతే రాజధానిలో ఆందోళనలు చేస్తామని, ప్రజాప్రతినిధులు ఇల్లు ముట్టడిస్తామని అన్నారు. కార్యక్రమంలో రతిరామ్ నాయక్, జగదీష్ నాయక్, బిషన్ నాయక్, నర్సింగ్, ప్రేమ సింగ్ తదితరులు పాల్గొన్నారు.