కామారెడ్డి, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దయాకర్ రావు అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. సబ్ సెంటర్ వారీగా గ్రామాలను గుర్తించి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని కోరారు.
మున్సిపల్ పరిధిలో వార్డుల వారీగా ఇంటింటి సర్వే నిర్వహించి 100 శాతం వ్యాక్సినేషన్ చేయించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామస్థాయిలో ఆరోగ్య, ఆశ, అంగన్‌వాడి కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ సోమేష్ కుమార్ మాట్లాడుతూ సర్వే చేపట్టిన ఇళ్లకు స్టిక్కర్లను అతికించాల ని సూచించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకోవాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, డిపిఓ సునంద, జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ దేవేందర్ పాల్గొన్నారు.