గాంధారి, సెప్టెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీపీసీసీ ఆధ్వర్యంలో గజ్వెల్లో నిర్వహిస్తున్న దళిత దండోరా సభకు గాంధారి కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం తరలివెళ్లారు. ఉదయం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద బాణాసంచాలు కాల్చిన కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తూ వాహనాలలో గజ్వెల్కు బయలుదేరారు. తరలివెళ్లిన వారిలో మండల కాంగ్రెస్ నాయకులు తూర్పు రాజు, బాలరాజ్, రవి, లైన్ రమేష్, కృష్ణ, మదర్, సంగని బాబా తదితరులు ఉన్నారు.