నిజామాబాద్, సెప్టెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా న్యాయవాధి పరిషద్ ఆధ్వర్యంలో నిజామబాద్ జిల్లా కోర్టు ఎదుట జాతీయ పతాకాన్ని పరిషద్ రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్ మోహన్ గౌడ్ ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం నిరంకుశ పాలన 17 సెప్టెంబర్ 19 48 న సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలోని భారత సైనిక చర్య ద్వారా నిజాం నవాబు లొంగిపోవడం తెలంగాణ ప్రాంతం ప్రజలు విముక్తి పొందారని అన్నారు. విముక్తి పోరాటంలో అమరులైన వారి త్యాగాలకు నిదర్శనంగా 17 సెప్టెంబర్ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లీగల్ కన్వీనర్ రాజ్‌కుమార్ సుబెదార్, న్యాయవాదులు ఉదయ్ కృష్ణ, బిట్లారవి, పిల్లి శ్రీకాంత్, లక్ష్మణ్ రాజు, గోవర్ధన్, అరవింద్ న్యాయవాదులు పాల్గొన్నారు.