కామారెడ్డి, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన తేజస్కర్ (21) డెంగ్యూ వ్యాధితో తెల్లరక్తకణాల సంఖ్య పడిపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా పాల్వంచ గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నవీన్‌కి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో స్పందించి హైదరాబాద్ వెళ్లి బి నెగిటివ్ ప్లేట్ లెట్స్ అందించి ప్రాణాలు కాపాడారు.
ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ నేటి సమాజంలో మనం ఎవరికీ రక్తం ఇవ్వకపోతే ఏమవుతుందిలే అనుకునే కంటే మనం కానీ, మన కుటుంబ సభ్యులు ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ మనకు రక్తం ఇవ్వకపోతే ఏమవుతుంది అని ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాలన్నారు. సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. దాత నవీన్‌ను అభినందించారు. రక్తదానం చేయాలనుకునేవారు వారి వివరాలను 9492874006 నెంబర్‌కి పంపించాలన్నారు.