వేల్పూర్, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంరామన్నపేట్ గ్రామంలోని బృహత్ పార్క్‌ను డీఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ చందర్ నాయక్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. బృహత్ పార్క్ పనులను కలెక్టర్ ఆదేశానుసారం ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. పార్క్‌లో మొక్కలు నాటడానికి గాను ఇతర గ్రామాల ఉపాధి కూలీలను తెప్పించుకోవాలని సూచించారు.
భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పార్క్‌లో రకరకాల పండ్లచెట్లను నాటాలని సూచించారు. పది ఎకరాల్లో నిర్మిస్తున్న పార్క్‌లో వర్షపు నీటిని స్టోర్ చేసేందుకు ఫామ్ ఫోండ్ లను నిర్మించాలని ఆదేశించారు. పార్క్‌లో వాకింగ్ ట్రాక్ నిర్మించాలని, పిల్లలకు ఆదుకొనెందుకు పార్క్ ఏర్పాటు చేయాలాని సూచించారు. బృహత్ పార్క్ పనులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని పీడి మండలాధికారి కమలాకర్ రావును ఆదేశించారు.
ఆయన వెంట సర్పంచ్ వీణ పురుషోత్తం రెడ్డి, ఎంపీటీసీ వనజ శోభన్, ఏపీఓ అశోక్, టీ. సీ సుకేష్ గౌడ్, సెక్రటరీ శివకుమార్ గౌడ్, కారోబార్ మహేష్, సీనియర్ మేట్ వనిత, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.