కామారెడ్డి, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్, థైరాయిడ్, డయాలసిస్ వంటి వ్యాధులు ఉన్నవారు ముందస్తుగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. పిల్లల వార్డును సందర్శించారు.
వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేయాలని వైద్యులకు సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని హరిప్రియ రైస్ మిల్లును సందర్శించారు. లక్ష్యానికి అనుగుణంగా ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని రైస్ మిల్ యజమానులకు సూచించారు. కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డివో రాజా గౌడ్, తహసీల్దార్ స్వామి, ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ కిష్టయ్య, రైస్ మిల్ యజమానులు పాల్గొన్నారు.