సమైక్య రాష్ట్రంలో కులవృత్తుల పట్ల నిర్లక్ష్యం వహించారు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమైక్య రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల మరియు అణగారిన కులవృత్తుల పట్ల నిర్లక్ష్యం వహించారని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక వెనుకబడిన అన్ని వర్గాల కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ప్రవేశ పెట్టి- ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఎంపీ బి.బి పాటిల్‌, స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌తో కలిసి ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 1,52,200 చేప పిల్లలను విడుదల చేశారు.

సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి వాటిలో మత్స్య కారులకు జీవనోపాధి కల్పించేందుకు సమీక ృత మత్స్య అభివ ృద్ధి పథకం ద్వారా ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను పంపిణి చేసి తర్వాత వాటిని అమ్ముకునేందుకు సమీకృత చేప మార్కెట్లను ఏర్పాటు చేసి మార్కెట్‌కు తరలించడానికి ద్విచక్ర వాహనాలను, గూడ్స్‌ వాహనాలను సబ్సిడీ ద్వారా అర్హులైన లబ్దిదారులకు అందిస్తుందన్నారు.

ఈ ఏడాది జిల్లాలో 3.36 కోట్ల చేపపిల్లలను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో వంద శాతం రాయితీపై చేప పిల్లలు పంపిణీ చేస్తుందని సూచించారు. రైతు బీమా, పెట్టుబడి సాయం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి పథకాలు పార్టీలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపడం కోసం ప్రభుత్వం రాయితీపై చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో చేపలని విక్రయించడానికి వాహనాలను రాయితీపై ఇచ్చిందని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం రాయితీపై చేప పిల్లలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. మత్స్యకారులకు 24 రకాల పరికరాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ, జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు, మత్స్య పరిశ్రమ పారిశ్రామిక సంఘం ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »