బోధన్, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోపిడీ వ్యవస్థ నిర్మూలనలో భాగంగానే కులాల నిర్మూలన జరుగుతుందని సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ డివిజన్ కార్యదర్శి కే. గంగాధర్ అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని గంజ్‌లో జరిగిన కుల నిర్మూలన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు.
నేటి పాలకులు కులాలను రూపుమాపకుండా కుల వ్యవస్థను ఇంకా పటిష్టంగా తయారుచేసి దళిత, పేద వర్గాన్ని ఇంకా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. కులాలకు వ్యతిరేకంగా ఎంతోమంది సంఘసంస్కర్తలు పోరాడినప్పటికీ భారత దేశంలో కులాలు పోలేవని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఐక్యంగా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి డి మల్లేష్, గుమ్ముల గంగాధర్, జి శ్రీనివాస్, పడాల శంకర్, బి నాగమణి, ఆర్ గౌతమ్ కుమార్, రవికుమార్ మాట్లాడారు. సదస్సులో సిహెచ్ యాదగిరి గౌడ్, జి సీతారాం, కే రవి, బి సాయిలు, డి పోశెట్టి, శ్రీను, సిహెచ్ గంగయ్య, లక్ష్మీ బాయి, ప్రేమానందం, రాములు తదితరులు పాల్గొన్నారు.