ఇదే ఉత్సాహంతో పనిచేయాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గారు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కామారెడ్డి జిల్లాలో ముగిసి రాజన్న సిరిసిల్లాలో సాగుతున్న పాదయాత్రలో శుక్రవారం ఉదయం లింగన్నపేట వద్ద జరిగిన యాత్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో సంగ్రామ యాత్ర విజయవంతం చేసినందుకు జిల్లా అధ్యక్షురాలు అరుణతారతో పాటు అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదే ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో జిల్లాలో 4 స్థానాల్లో కాషాయ జండా ఎగరవేయటానికి కష్టపడి పనిచేయాలన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలు అరుణతారని, జిల్లా ఇంచార్జి మైపాల్‌ రెడ్డిని, కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డిని సన్మానించారు. అనంతరం జిల్లా శాఖ తరుపున జిల్లా అధ్యక్షురాలు అరుణతార రాష్ట్ర రథసారథి బండి సంజయ్‌ని సన్మానించారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »