కామారెడ్డి, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ వివరాలను స్టాఫ్ నర్స్ సుస్మితను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల వారిగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామాల వారిగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తిచేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.