మహిళా చైతన్యానికి, పోరాటానికి ఐలమ్మనే స్ఫూర్తి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహనీయుల చరిత్రలు తెలుసుకొని వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 126వ జయంతినీ పురస్కరించుకొని బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వినాయక్‌ నగర్‌లోని ఆమె విగ్రహం వద్ద, కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌లోను ఆదివారం కార్యక్రమాలు ఏర్పాటుచేసారు.

కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో జ్యోతి ప్రజ్వలన గావించి ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని, మహనీయుల జీవిత చరిత్ర తెలుసుకుని మనము నేర్చుకోవలసిన అంశాలు ఉంటాయని అన్నారు.

చాకలి ఐలమ్మ మహిళగా న్యాయం కోసం నమ్మిన సిద్ధాంతాన్ని ఎదిరించడం జరిగిందని, ఒక మహిళ చైతన్యానికి పోరాట స్ఫూర్తికి ఆత్మగౌరవానికి ప్రతీకగా జయంతిని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆమెలోని ధైర్యాన్ని, పోరాటాన్ని ప్రతి ఒక్క మహిళ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలకు ప్రశ్నించే తత్వం తక్కువ ఉంటుందని ప్రశ్నించే గొంతు ఎప్పుడు వస్తుందో అప్పుడు మన యొక్క ఆత్మ గౌరవం ఇనుమడిరపజేస్తుందని, ఎంతోమంది సంఘ సంస్కర్తలు మన దేశానికి సేవ చేసిన వారు ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలి అన్నారు.

జిల్లా కలెక్టర్‌ తరపున అందరికీ ఐలమ్మ 126 వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. బిసి రజక సంఘాల నాయకులు అడిగిన వాటికి వివరణ ఇస్తూ కుల బహిష్కరణకు సంబంధించి అటువంటి అంశం వచ్చినట్లయితే కలెక్టర్‌ దృష్టికి కానీ తన దృష్టికి కానీ తేవాలని ఏసీపీ, తహసిల్దార్‌ సర్పంచ్‌ ప్రజా ప్రతినిధుల సహాయంతో విషయాన్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇంతటి ఆధునిక సమాజంలో బహిష్కరణ అనేది అనాగరిక చర్య అన్నారు. బీసీ లోన్స్‌ స్కాలర్షిప్స్‌కు సంబంధించి గత కొంత కాలంగా కరోనా కారణంగా ఆలస్యం జరిగిందని ప్రభుత్వం పాజిటివ్‌గా ఉన్నది రానున్న రోజుల్లో బడ్జెట్టు వచ్చిన వెంటనే శాంక్షన్‌ ఆర్డర్‌ ఇస్తాం అన్నారు. బిసి హాస్టల్స్‌ బాలికల, బాలుర సాంక్షన్‌ అయిన వాటికి అద్దె భవనాలు ఐడెంటిఫై చేశారు. నెలలో ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. బాలికలు, బాలురు హాస్టల్‌ అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

దోబీ ఘాట్‌ అన్యాక్రాంతం అయిన వాటిపై రిప్రజెంటేషన్‌ చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రజక సంఘం అధ్యక్షులు శంకర్‌ మానస, గణేష్‌, బంగారు సాయిలు, సిహెచ్‌ బిక్షపతి, వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్‌ రాజేశ్వర్‌, నాని, అంజయ్య, రమాదేవి, రామ్‌చందర్‌, సాయిలు, నర్సయ్య, కనకరాజు, కుల సంఘాల నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »