ఆర్మూర్, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లతో పోరాటం చేసిన వీర వనిత ఐలమ్మ 126 వ జయంతి పురస్కరించుకుని ఆర్మూర్ ధోబి ఘాట్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన నలుగురు కొడుకులను తన ముందే రజాకార్ల చేతిలో కోల్పోయినప్పటికిని, తన కూతురు రజాకార్ల చేతిలో బలాత్కారానికి గురైనప్పటికిని భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం అంతేకాకుండా బాంచన్ కాల్మొక్త అనే బతుకులను మార్చడంకోసం రజాకార్లను ఎదిరించిన వీర వనిత అన్నారు.
తాను పండిస్తున్న భూమి తనదేనని, పండిరచిన పంటలోని ప్రతీ గింజ తనదేనని తీసుకెళ్లడానికి రజాకార్ల దొర ఎవ్వడని, తన ప్రాణం పోయినా పంటలోని ఒక్క గింజ కూడా ఇచ్చేది లేదని పిడుగులా మాట్లాడి రజాకార్ల గుండెల్లో అగ్నిభరాటంగా నిలిచి రైతాంగ విప్లవానికి నాంది పలికిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మకు జోహార్లు అని, తెలంగాణ వీరవనితలలో ఆదర్శప్రాయమైన చాకలి ఐలమ్మ జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చి తెలంగాణ ఆడబిడ్డలకు తెలియజేయవలసిన అవసరంవుందనాÊ్నరు.
అదేవిధంగా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సైతం భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వీక్షించారు. మోడీ చెప్పిన విషయాలను విని వాటిని ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఈ సందర్భంగా తెలిపారు.
కార్యక్రమాలలో బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి దుగ్గివిజయ్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు విజయానంద్, బిజెపి సీనియర్ నాయకులు బ్యూటిల్యాండ్రి సురేందర్, దన్ పాల్ శివ, భూపేందర్, కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పాలెపు రాజు, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు పెద్దోళ్ల భరత్, చిలుకూర్ సాయినాథ్ రెడ్డి, గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కేలోత్ పీర్‌సింగ్ నాయక్, కార్యదర్శి రవీందర్ నాయక్, దళిత మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పులి యుగంధర్ బిజెపి, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.