గాంధారి, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల పదవీకాలం ఈ నెల (సెప్టెంబర్) 15 వ తేది నాటికి ముగిసిందని మార్కెట్ కార్యాలయ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. అప్పటి నుండి మార్కెట్ కమిటీ నిర్వహణ బాధ్యతలు నిజామాబాద్ జిల్లా మార్కెటింగ్ అధికారి ఎస్. గంగు చేపడుతున్నారని అన్నారు.
రైతులకు మార్కెట్ కమిటీ కార్యాలయంలో కానీ, ఆవరణలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని, సమస్యలను జిల్లా అధికారుల ద్రుష్టికి తీసుకొనివెళ్తానని సూచించారు. అయితే గతంలో చైర్మన్ పదవి ఎస్సి రిజర్వేషన్ కావడంతో ఆ పదవిలో పెద్దబూరి సత్యం కొనసాగారు. ఇప్పుడు ఆయన పదవికాలం ముగిసింది. నూతనంగా చైర్మన్ పదవి జనరల్ ఓపెన్ రిజర్వేషన్ రావడంతో ఎవరికీ పదవి వరిస్తుందో చూడాలి.