కామారెడ్డి, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్లమెంటులో న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి డిమాండ్ చేశారు. సోమవారం అదనపు జిల్లా కోర్టు సముదాయం ప్రధాన గేటు వద్ద కామారెడ్డి న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల ఢల్లీి రోహిణి కోర్టులో జరిగిన దాడిని ముక్తకంఠంతో ఖండిరచారు.
కామారెడ్డి న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాలు చేపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా న్యాయవాదుల రక్షణ కోసం చట్టం తేవాలన్నారు. అన్ని కోర్టులలో భద్రత పెంచాలని ఆయన కోరారు. కోర్టులలో న్యాయవాదులకు, కక్షిదారులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు జగన్నాథం, అన్వర్ షరీఫ్, షబానా బేగం లు మాట్లాడారు. నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, వెంకట్ రామ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బాలకృష్ణ, జై గంగాధర్, నాగభూషణం, సూర్య ప్రసాద్, శ్రీధర్ సురేందర్ రెడ్డి, మొహమ్మద్ అబ్దుల్ సలీం, అమృత రావు, మోహన్ రావు, నవీన్, నాగేశ్వరరావు, స్టీఫెన్ రాజు, దేవరాజ్, తదితరులు పాల్గొన్నారు.