హైదరాబాద్, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ 28, 29 న జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రెండు రోజుల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
మిగిలిన తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలలో ఎటువంటి మార్పు లేదన్నారు. వాయిదా వేసిన పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని, వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలని, స్టడీ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు.