కామారెడ్డి, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గులాబ్ తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన మరియు రానున్న రెండు, మూడు రోజులు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున జిల్లా ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కామారెడ్డి జిల్లా పోలీసుశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
అందరికి తెలిసిన విషయమే ఈ సంవత్సరం ఇదివరకు కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు, డ్యాములు అన్ని కూడా పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. అదేవిదముగా జాలాశయాల గేట్లుకూడా తెరవడం వలన పల్లపు ప్రదేశాలకు నీరు ప్రవహిస్తున్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
చేపలు పట్టడానికి, పశువులు మేపడానికి ఎవరు కూడా డ్యాములు, చెరువులు, వాగులు, కాలువల దగ్గరి వెళ్ళకూడదన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పురాతన ఇండ్లు, గుడిసెలు కూలే అవకాశం ఉన్నది, కావున వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు వాటిలో ఉండకూడదన్నారు.
రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తున్న దారుల గుండా ఎట్టి పరిస్తితులలో వెళ్లకూడదని, అన్నీ ప్రాంతాలు కూడా తడిసి ఉన్నందున కాలుజారి నీటిలో/ప్రవాహాలలో పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదన్నారు.
జిల్లా ప్రభుత్వ యంత్రాంగాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుండి ప్రజలందరిని సురక్షితంగా ఉంచడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారని, తమరు తమ గ్రామంలో వర్షాల వలన ఎటువంటి అంతరాయం ఏర్పడిన, ఏర్పడే అవకాశం కలదు అని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులు (ఎస్ఐ, ఎంఆర్వో) కు లేదా కింద తెలిపిన పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు.
9490617633.
08468 226633.