కామారెడ్డి, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ శ్రద్ధగా విన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను విన్న కలెక్టర్ వివిధ శాఖల అధికారులను వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు.