ఆర్మూర్, సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం, సంతోష్ నగర్‌లో గల లోతట్టు ప్రాంతం సిక్కుల కాలనీలో పేద సిక్కు కులస్థులు ప్రభుత్వ స్థలంలో చిన్న చిన్న గుడిసెలు రేకుల షెడ్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ఇండ్లలో వర్షపు నీరు వచ్చి బియ్యం, ఇతర వస్తువులు తడిసి నష్టం వాటిల్లింది.
మంగళవారం ఉదయం మున్సిపల్ కౌన్సిలర్ సంగీతా ఖాందేష్, తెరాస పట్టణ నాయకులు ఖాందేష్ సత్యంతో కలిసి సిక్కుల కాలనీకి వెళ్లి సమస్యలు పరిశీలించారు. వెంటనే మున్సిపల్ కమిషనర్‌కి, సానిటరీ అధికారికి సమస్య వివరించి మున్సిపల్ సిబ్బందిని పంపాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది వచ్చి తాత్కాలికంగా పరిష్కరించారు.
సిక్కుల దీన స్థితినిఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జ్ రాజేశ్వర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామని చెప్పారు. అలాగే జిరాయత్ నగర్‌కు వెళ్లి అక్కడ కల్వర్ట్ వద్ద నీరు నిలిచిపోతే వెంటనే సానిటరీ సిబ్బందికి చెప్పారు. మున్సిపల్ సిబ్బంది శంకర్ తదితరులు వున్నారు.