ఆర్మూర్, సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమ సమితి కామరెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల రైతు అధ్యక్షులు బుల్లెట్ రాంరెడ్డి మాట్లాడారు.
గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి సోయలు, మక్క, వరి తీవ్రంగా రైతులు నష్టపోయారని, గత జూన్ నుండి ఇప్పటి వరకు రైతులు తమ దగ్గర వున్న డబ్బులు అన్ని పెట్టుబడులు పెట్టి తమ పంటలు చేతికి వస్తాయనే సమయానికి అతి భారీగా వర్షాలు పడి తీవ్రంగా నష్టపోయమని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని, అలాగే రైతులకు పంట భీమా వెంటనే ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గడ్డం రమేష్, కుమ్మరి భుమేశ్, గొల్ల చిన్న నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.