నారాయణ ఖేడ్, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించడం జరిగిందని ఏ.డీ.ఏ కరుణాకర్ రెడ్డి అన్నారు. బుధవారం పంటలు పరిశీలనలో భాగంగా మనూర్ మండలం పులకుర్తి గ్రామ శివారులో మండల ఏ.వో శ్రీనివాస్ రెడ్డితో కలసి పత్తి, చెరకు పంటలను పరిశీలించిన సందర్బంగా మాట్లాడారు.
భారీ వర్షాలు కురిసి దెబ్బతిన్న పంటల వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పంపించామన్నారు. దెబ్బతిన్న పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలు అయిన శనగ, తెల్ల కుసుమ తదితర పంటలు సాగు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అంబ రెడ్డి, అన్వేర్, సంజీవ రెడ్డి, సంగరెడ్డి తదితరులు పాల్గొన్నారు.