బోధన్, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్‌లోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోధన్‌లోని రైల్వే సమస్యలపై విద్యార్ధి నాయకుడు శివ కుమార్ మాట్లాడారు. నిజాం కాలం నుండి పట్టాలు ఉన్నా రైళ్లు మాత్రం నడవకపోవడం బాధాకరమని, బోధన్ రైళ్ల ద్వారా నెలకు 3 కోట్ల ఆదాయం ఉన్నా బోధన్ ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు అందించక పోవడంలో మర్మం ఏమిటో రైల్వే శాఖ తెలపాలని పేర్కొన్నారు.
బోధన్‌లోని అన్ని రాజకీయ పార్టీల విద్యార్ధి నాయకుల సహకారంతో బోధన్ రైల్వే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, బోధన్‌కు అన్ని సౌకర్యాలు ఉన్నా ప్రయాణికులకు రైల్వే సౌకర్యాలు అందడంలో నిర్లక్ష్యం వహించడంలో కారణం ఏమిటో రైల్వే శాఖ తెలపాలని డిమాండ్ చేశారు. బోధన్ ప్రజలు రైల్వే సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని, ప్రజాప్రతినిధులు రైల్వే సౌకర్యాలపై దృష్టి సారించాలని, బోధన్ రైల్వే సౌకర్యాలపై ప్రజాప్రతినిధులు గళం విప్పాలని అన్నారు.
బోధన్ ప్రాంత అభివృద్ధిపై ఆలోచన చేయాలని, బోధన్, ఎడపల్లి ప్రజలు రైల్వే సౌకర్యాలకు వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారని వారికి సమాధానం చెప్పవలసిన అవసరం ప్రజా ప్రతినిధులకు ఉందన్నారు. ప్రజా రవాణా సౌకర్యాలు కల్పించి బోధన్ అభివృద్ధికై కృషి చేయాలని కోరారు.
డిమాండ్లు
బోధన్ -మీర్జాపల్లి ప్యాసెంజర్ (57502) రైలు పునరుద్దరించాలి.
రాయలసీమ ఏక్స్‌ప్రెస్ రైలు బోధన్ నుండి ప్రారంభించాలి.
బోధన్ – బీదర్ రైల్వే లైన్ పనులు ప్రారంభించాలి.
బోధన్ రైల్వే బుకింగ్ కౌంటర్ తక్షణమే ప్రారంభించాలి.
నిజామాబాద్ – కరీంనగర్ (దేము) 77259 బోధన్ నుండి ప్రారంభించాలి.
రద్దు చేసిన ఎడపల్లి మరియు శక్కర్ నగర్ రైల్వే స్టేషన్లు తిరిగి ప్రారంభించాలి.
బోధన్, గాంధీ పార్క్ మరియు ఎడపల్లిలలోని రైల్వే స్టేషన్, ప్లాటుఫారం మరమ్మతులు చేపట్టాలి.
బోధన్ నుండి తెలంగాణ విశ్వవిద్యాలయం డిచ్‌పల్లి వెళ్లే విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని బోధన్ విద్యార్ధి జేఏసీగా డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉదృతం చేసి బోధన్‌కు రైళ్లు సాధించుకునే వరకు పోరాడతామని అన్నారు.
కార్యక్రమంలో బోధన్ విద్యార్ధి నాయకులు, యువనాయకులు నాగరాజ్, నవీన్ తలరే, గౌతమ్ కుమార్, తలరే సంజయ్, ఏతోండా రాజేందర్, జునైద్ అహ్మద్, రాంచందర్, చిత్రాల చిన్న, కిరణ్ కుమార్, జ్వాలారాణి, ఉదయ్, అలీ, లోకేష్, సమీర్, బోధన్ యువ నాయకులు పాల్గొన్నారు.