బలహీనమైన పిల్లలను గుర్తించి పౌష్టికాహారం అందించాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌ వాడి కేంద్రాలలో బలహీనమైన పిల్లలను గుర్తించి పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం టెలీ కాన్ఫరెన్సు ద్వారా ఐసిడిఎస్‌, ఐకెపి అధికారులతో మాట్లాడారు.

పిల్లల ఎత్తు, బరువులను ప్రతివారం తీసి వారికి కావాల్సిన పోషణ అందించాలని సూచించారు. బలహీనంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఐసిడిఎస్‌ అధికారులను ఆదేశించారు. అంగన్‌ వాడి కేంద్రాలు సమర్థవంతంగా పని చేసేలా చూడాలన్నారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో న్యూట్రిషన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. టెలి కాన్ఫరెన్సులో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిని సరస్వతి, సిడిపివోలు, పర్యవేక్షణ అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »