ఆర్మూర్, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్ ఔట్ రీచ్ బ్యూరో నిజామాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో స్వాతంత్య్ర సమరయోధులపై ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు.
అక్టోబర్ 1వ తేదీ శుక్రవారం నుండి మూడురోజుల పాటు ఎగ్జిబిషన్ స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు (కొత్త బస్టాండ్ ఎదురుగ) లో జరగనుంది.
భారతదేశం స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్ళు పూర్తవుతున్న సంరద్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏర్పాటు చేయనున్న ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆర్మూర్ ఆర్‌డివో శ్రీనివాసులు ప్రారంభిస్తారని నిజామాబాద్ ఫీల్డ్ పబ్లిసిటి ఆఫీసర్ శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.
కార్యక్రమంలో స్తానిక మునిసిపల్ ఛైర్‌పర్సన్ వినీత పండిట్, ఎంపిపి అధ్యక్షుడు పస్క నర్సయ్య, జడ్పిటిసి సంతోష్, మునిసిపల్ కమీషనర్ జగదీశ్వర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి భారతి, కౌన్సిలర్లు పాల్గొంటారని తెలిపారు. ఫోటో ఎగ్జిబిషన్ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు దేశభక్తి సంబంధిత అంశాలపై వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నట్టు ఆయన వివరించారు.