వేల్పూర్, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంలోని బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామంలో మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు లబ్దిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్టు ఆర్టిఏ మెంబర్ రాములు తెలిపారు.
ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల ప్రజలు అనారోగ్య రిత్యా సిఎంఆర్ఎఫ్కు దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కృషివల్ల చెక్కులు మంజూరయ్యాయని మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.