నిజామాబాద్, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య మరొకసారి తన ప్రతిభను చాటి భారత దేశ మహిళా ఫుట్‌బాల్ టీమ్‌కు సెలక్ట్ అవ్వడం గర్వకారణం అని కేర్ ఫుట్‌బాల్ అకాడమీ అధ్యక్షులు నరాల సుధాకర్ అన్నారు.
అక్టోబరు 2వ తేదీ నుండి దుబాయిలో నిర్వహించనున్న స్నేహ పూర్వక మ్యాచ్‌లు ఆడడానికి భారతదేశ మహిళా జట్టుకు సౌమ్య ఎన్నిక అయిందని, అదేవిధంగా దుబాయ్ టోర్నమెంట్ తర్వాత బెహరాన్‌లో నిర్వహించు స్నేహపూర్వక పోటీ కూడా భారతదేశం తరఫున సౌమ్య ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని అన్నారు.
ఈ సందర్బంగా కోచ్ గొట్టిపాటి నాగరాజును పలువురు అభినందించారు. నిజామాబాద్ జిల్లా ఫుట్‌బాల్ అధ్యక్ష కార్యదర్శులు శఖీల్, ఖలీల్‌లు కూడ సౌమ్య, నాగరాజును అభినందించారు.