కామారెడ్డి, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం రత్నగిరి పల్లెలో గురువారం ఉపాధి హామీ పథకంలో చేపట్టిన కాంటూరు కందకాలు, ఉట చెరువులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పనులకు సంబంధించిన వర్క్ ఫైల్ సక్రమంగా ఉండే విధంగా చూడాలన్నారు. ఆధార్ కార్డుల అప్డేషన్ పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.