కామారెడ్డి, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కాప్రబోయిన జ్యోతి గర్భిణీ (26) ప్రభుత్వ వైద్యశాల కామారెడ్డిలో రక్త హీనతతో బాధపడుతుండటంతో వారికి కావలసిన బి పాజిటివ్ రక్తాన్ని ప్రజా ప్రతినిధి ఛానల్ జిల్లా విలేకరి నారాయణ, పృథ్వి రాజ్ గౌడ్లు మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు.
జాతీయ స్వఛ్చంద రక్తదాన దినోత్సవం నాడు ముందుకు వచ్చి ప్రాణాలు కాపాడడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ 2007 నుంచి కామారెడ్డి రక్తదాతల సమూహం ద్వారా ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేసే ప్రాణాలు కాపాడడం జరుగుతుందన్నారు. రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతలను అభినందించారు. కార్యక్రమంలో వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్, రజిత తదితరులున్నారు.