వృద్ధులను ప్రభావితం చేసే సమస్యల గురించి అవగాహన

వేల్పూర్‌, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృద్ధులను ప్రభావితం చేసే సమస్యల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 1 న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా శుక్రవారం వేల్పూర్‌ మండలంలోని ఎంపీపీ భవనంలో ఎంపీపీ భీమ జమున అధ్యక్షతన ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ నీరజ ఆధ్వర్యంలో అత్యంత వయోవృద్ధులైన చిట్టి మేళ పెద్ద గంగు, గుగ్గిలం లింగన్నను సన్మానించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో భాగంగా అధికారులు మాట్లాడుతూ యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ 14 డిసెంబర్‌, 1990 న ఒక తీర్మానాన్ని ఆమోదించిందని, అక్టోబర్‌ 1 వ తేదీని అంతర్జాతీయ వృద్ధుల దినంగా ప్రకటించిందన్నారు. సీనియర్‌ సిటిజన్లు సమాజంలోని నాయకులుగా తమ భుజాలపై చాలా బాధ్యతలు నిర్వహిస్తారని, వారు సమాజంలోకి సంప్రదాయాలు, సంస్కృతిని తీసుకువెళతారని, జ్ఞానాన్ని యువ తరానికి తెలియజేస్తారన్నారు.

అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం 2021 నేపథ్యం – ‘‘సాంకేతిక సమానత్వం అన్ని వయసుల వారికి’’ డిజిటల్‌ ప్రపంచంలో వృద్ధుల గోప్యత, భద్రతను నిర్ధారించడానికి విధానాలు, చట్టపరమైన చట్రాల పాత్రను అన్వేషించడానికి అన్నారు. వృద్ధుల హక్కులపై చట్టబద్ధంగా కట్టుబడి ఉండే పరికరం, అన్ని వయసుల వారికీ సమాజం కోసం ఖండన వ్యక్తి-కేంద్రీకృత మానవ హక్కుల విధానాన్ని హైలైట్‌ చేయడం కోసమన్నారు.

ఎల్డర్‌ లైన్‌ (నేషనల్‌ హెల్ప్‌ లైన్‌ ఫర్‌ సీనియర్‌ సిటిజెన్స్‌) అనే పేరుతో వ ృద్ధులకు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14567 వయో వృద్ధుల హెల్ప్‌ లైన్‌ నడుపుతున్నదని, హెల్ప్‌ లైన్‌ ద్వారా నిరాశ్రయులకు ఆదరణ, వేధింపులకు గురవుతున్న పెద్దల సంరక్షణ మానసిక భావోద్వేగాలకు సలహా, సూచనలు, చట్టపరమైన మార్గదర్శకత్వం, వృద్ధాశ్రమాలు/ సంరక్షకులు/ కాలక్షేప కేంద్రాల గురించిన సమాచారం అందిస్తారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని అనుమతి పొందిన అన్ని వృద్ధాశ్రమాలలో నిబంధనల మేరకు అన్ని వసతులు, సౌకర్యాలున్నాయో లేదో పరిశీలిచడం జరుగుతుందని, దీనికి తెలంగాణ రాష్ట్ర వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన యాప్‌ ద్వారా పర్యవేక్షణ, నిబంధనలు జరుగుతాయన్నారు. సంబంధిత జిల్లా సంక్షేమ అధికారులు ఈ బాద్యతలు వహిస్తుంటారన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సురేష్‌, ఎంపీడీవో కమలాకర్‌, ఎమ్మార్వో సతీష్‌ రెడ్డి, ఏపీఓ అశోక్‌, అంగన్‌వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »