విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో చదవాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో చదవాలని ఓయు ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాము షెఫర్డ్‌ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా కళాశాలలో ఎంఎస్‌డబ్ల్యు విద్యార్థులకు మొదటి సెమిస్టర్‌ పరీక్షకు సంబందించిన వైవా కార్యక్రమానికి ఆయనతో పాటు సౌత్‌ క్యాంపస్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వీరభద్రం హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముందుగా కళాశాలలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఎంఎస్‌డబ్ల్యు వృత్తి విద్యా కోర్సులో మంజీరా కళాశాలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉండడాన్ని వారు అభినందించారు. అంతకుముందు విద్యార్థులకు మౌఖిక పరీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు పలు అంశాలపై ప్రొఫెసర్లు రాము షెఫర్డ్‌, డాక్టర్‌ వీరభద్రంలు అవగాహన కల్పించారు. విద్యార్థులు మంచి గుణాత్మక మైన విద్యను అభ్యసించాలని సూచించారు. అలాగే ఎంఎస్‌ డబ్ల్యు వల్ల అనేకమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని అయితే వాటిపై అవగాహన లేకపోవడం వల్ల ఈ కోర్సు చేయలేకపోతున్నారన్నారు.

చదువు అంటే కేవలం పుస్తకాల్లో ఉన్నది మాత్రమే కాదని, సమాజాన్నే ఓ ప్రయోగశాలగా భావిస్తూ విద్యను అభ్యసించాలని సూచించారు. ప్రతీ విద్యార్థి మంచి నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం పెరుగుతున్న శాస్త్ర సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు తమ మేధస్సుకు మరింత పదునుపెడుతూ ముందుకు సాగాలని సూచించారు. ప్రతీ విద్యార్థిలో నైపుణ్యం దాగి ఉంటుందని కానీ ఆత్మానున్యత భావన వల్ల రాణించలేకపోతున్నారని తెలిపారు.

విద్యార్థులకు ఈ కోర్సు వల్ల మంచి భవిష్యత్తు ఉందని, కేవలం సర్టిఫికెట్ల కోసం, పర్సెంటేజీల కోసం కాకుండా గుణాత్మకమైన మార్పు కోసం విద్యార్థులు పరిశోదనతో కూడిన విద్యను అభ్యసించాలని అన్నారు. ముందుగా విద్యార్థులు భయాన్ని వీడి ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవడం వల్ల మంచి విషయ పరిజ్ఞానం ఏర్పడుతుందన్నారు.

అలాగే విద్యార్థుల ఆసక్తి, క్రమశిక్షణ చాలా బాగుందని ఇదే తరహాలో విజయవంతంగా కోర్సు పూర్తి చేసి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ ఆద్వర్యంలో ప్రొఫెసర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ తో పాటు హెవ్‌వోడీ డాక్టర్‌ సాయిలు, ఫ్యాకల్టీ కె.జీవన్‌ నాయక్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »