నిజామాబాద్, అక్టోబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక నాలుగవ పోలీస్ స్టేషన్ పక్కన గల ఈవీఎం గోదాంలో ఈవీఎంల పరిస్థితిని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలలో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎంల పరిస్థితిని పరిశీలించాలని ఆదేశాలు ఉన్నందున మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరచి ఉన్న గదుల సీల్ ఓపెన్ చేసి వాటిని పరిశీలించారు.
కలెక్టర్ వెంబడి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.