మెడికల్‌ ఆఫీసర్లు రోజు ఫీల్డ్‌లో వెళ్ళాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెడికల్‌ ఆఫీసర్లు రోజు ఫీల్డ్‌లో వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌ సమావేశం మందిరంలో సీజనల్‌ వ్యాధులు, వ్యాక్సినేషన్‌పై వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి మెడికల్‌ ఆఫీసర్‌ రోజు కనీసం గంట సేపైనా ఫీల్డ్‌లో వెళ్లాలని అన్నారు. పదిహేను రోజులు గట్టిగా పనిచేయాలన్నారు.

ఏఎన్‌ఎం, ఆశ వర్కర్‌ను గట్టిగా మానిటరింగ్‌ చేయాలని వారితో పాటు గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ నుండి ఒకరిని టీమ్‌లో నియమించాలని తెలిపారు. గ్రామాలలో మున్సిపాలిటీలో మస్కిటో డెంగ్యు మస్కిటో కాయిల్‌ వాడే విధంగా అవగాహన కల్పించాలన్నారు. దోమల నివారణలో మెడికల్‌ టీమ్స్‌ చెప్పిన తర్వాత ఆ మున్సిపాలిటీ గాని గ్రామపంచాయతీ వారు వినకుంటే తమకు తెలియ చేయాలని అన్నారు. మున్సిపాలిటీ నుండి లోకల్‌ బాడీ నుండి టీమ్‌లో ఒకరిని తీసుకోవాలన్నారు.

దోమల నివారణకు ఆయిల్‌ బాల్స్‌ వేయడం స్ప్రే చేయడం ఫాగింగ్‌ మిషన్లు జిల్లాలో 230 ఉన్నవన్నీ రేపటి నుండి వర్క్‌ చేయుటకు యాక్షన్‌ ప్లాన్‌తో వెళ్లాలన్నారు. 15 రోజులు గట్టిగా పనిచేయాలని అవసరం ఉంటే స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ పర్మిషన్‌ ఇస్తామన్నారు. ఎక్కడ కేసులు ఉన్న అక్కడ గట్టిగా వెళ్ళండి, స్లమ్‌ ఏరియాలో ఫోకస్‌ చేయండి అన్నారు. ప్రతి పిహెచ్‌సి వారిగా ప్లాన్‌ ఉండాలన్నారు. డెంగ్యూ సీజనల్‌ వ్యాధులు కంట్రోల్‌కు తీసుకురావాలని 100 శాతం చేంజ్‌ అయి ఉండాలని పీహెచ్‌సి పరిధిలో ప్లాన్‌తో ముందుకు వెళ్లాలన్నారు.

వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తి కావాలన్నారు. 50 శాతం జనరల్‌ 50 శాతం టార్గెట్‌తో అయ్యే విధంగా ప్లాన్‌ చేయాలన్నారు. ప్రతి పీహెచ్‌సిలో రెండు హ్యాబిటేషన్‌లు 100 శాతం వారంలో పూర్తి వ్యాక్సినేషన్‌ జరగాలన్నారు. గత సంవత్సరం డెంగ్యూ కేసులు 56 నమోదు కాగా ఈ సంవత్సరం ఇప్పటికే 264 నమోదు కావడం ఆలోచించి అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని మెడికల్‌ ఆఫీసర్లు బాగా పని చేస్తున్నారు కానీ రిజల్ట్‌ మీద ఫోకస్‌ చేయాలన్నారు. కోఆర్డినేషన్‌తో కేసులు తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ ఇంచార్జ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ చిత్ర మిశ్రా, డిఎం హెచ్‌వో బాల నరేందర్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »