నిజామాబాద్, అక్టోబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంపు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం 60 ప్రకారం కేటగిరీల వారీగా (రూ. 15600, రూ. 19500, రూ. 22750) మున్సిపల్ కార్మికులందరికీ వేతన పెంపు అమలు చేయాలన్నారు.
2021 జూన్ నెల నుండి వేతన పెంపు అమలు చేసి, ఏరియర్స్ ఇప్పించాలన్నారు. కొత్తగా నియమింపబడ్డ మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లకు వేతన బకాయిలు ఇప్పించాలన్నారు. కార్మికులందరికీ ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ డిమాండ్లపై ఇప్పటికే పలు దఫాలుగా వినతులు, ఆందోళనలు నిర్వహించామన్నారు. ఇకనైనా తక్షణమే జీవో నెం. 60 అమలు పూనుకోవాలని, లేనిచో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో యూనియన్ నాయకులు కే.రాజేశ్వర్, గోవర్ధన్, శివకుమార్, సైదులు, శాంతికుమార్, గంగాధర్, శంకర్, ఎస్.శివకుమార్, విఠల్, శ్రీనివాస్, కిరణ్, రవి, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.