వేల్పూర్, అక్టోబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ సమావేశ మందిరంలో వేల్పూర్ గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా మోహన్ దాస్ ఎన్నికైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ సందర్బంగా మోహన్ దాస్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. తమను నమ్మి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా దయాకర్, కార్యదర్శిగా నర్సారెడ్డి, ఉప కార్యదర్శిగా నయుం, క్యాషియర్‌గా వెంకటేష్ గౌడ్లను ఎన్నుకున్నారు.