నిజామాబాద్, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కవిత కాంప్లెక్స్‌లో జరిగిన సమావేశంలో శుక్రవారం సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎస్జెడబ్ల్యూహెచ్అర్సి) సంస్థలో బాల్కొండ నియోజకవర్గం బీసీ చైర్మన్‌గా గుండు నాగరాజును తెలంగాణ ఎస్జెడబ్ల్యూహెచ్అర్సి చైర్మన్ మామిడాల మనోహర్ నియమించారు.
ప్రజా సేవ చేయటానికి మానవ హక్కుల పరిరక్షణ కోసం పని చేసేందుకు సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, కుల వివక్ష, భూకబ్జాలు బాలకార్మికుల నిర్మూలన లైంగిక వేధింపులు భ్రూణ హత్యలు గృహనిర్బంధం వంటి వాటి నిర్మూలన కోసం పనిచేసి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరు కాపాడాలని తెలిపారు.
కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా చైర్మన్ ఉళ్లేంగ నాగరాజు, జిల్లా సెక్రెటరీ లక్ష్మణ్ గౌడ్, నగర డైరెక్టర్ గంగాధర్, బాల్కొండ నియోజకవర్గ చైర్మన్ నర్సాగౌడ్, నందిపేట మండలం చైర్మన్ దాసరి సాగర్, లీగల్ అడ్వైజర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.