కామారెడ్డి, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్‌తో మృతిచెందిన ఇద్దరు ఐకేపీ సమన్వయకర్తల కుటుంబాలకు రూ.1.50 లక్షల చెక్కులను జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అందజేశారు.
శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఐకేపీ సమన్వయకర్తలు విజయ్ కుమార్, నరేష్ కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు.