ఆర్మూర్, అక్టోబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ విప్లవ పోరాట యోధులు కామ్రేడ్ చేగువేరా 54 వ వర్ధంతి సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కేంద్రంలో న్యూడెమోక్రసీ కార్యాలయం కుమార్ నారయణ భవన్‌లో చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా పివైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్ మాట్లాడుతు అర్జెంటినాలో పుట్టి ప్రజలు ఎదుర్కుంటున్న పేదరికం, దోపిడి పీడనలను పరిశీలిస్తు స్పందించే హృదయం కలిగిన చే క్యుబాలో క్యాస్ట్రోతొ కలిసి నియంత బాటిస్టా పాలన అంతమొందించి అధికారం చేజిక్కించుకున్న తర్వాత కూడ పొరుగున ఉన్న బోలీవియాను విముక్తి చేయాలని మళ్లీ గెరిల్లా పోరుబాట పట్టి ఆ దేశంలో ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో అమెరికా సామ్రాజ్యవాద సీఐఎ దళాల చేతికి చిక్కి హింసించబడి అమరుడయ్యాడని అన్నారు.
చేగువేరా ప్రపంచ విప్లవ స్వాప్నికుడని దోపిడి పీడనలు లేని సమసమాజాన్ని కాంక్షించె వారందరికి స్పూర్తి ప్రదాత అని, అతను కోరిన సమాజాన్ని సాధించె దిశగా సాగే పోరాటాల్లో భాగస్వాములు అవుదామని యువతకు వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పివైఎల్ పట్టణ ఉపాధ్యక్షులు ప్రసాద్, తూర్పటి శ్రీనివాస్, మనోజ్, నజీర్, రాజు, లింబాద్రి, రమేశ్ పాల్గొన్నారు.