కామారెడ్డి, అక్టోబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రం భిక్నూర్ గ్రామానికి చెందిన మామిడాల వెంకటాచారి (58) రక్తహీనతతో బాధపడుతుండడముతో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా దోమకొండకి చెందిన జనవాహిని విలేకరి సంతోష్ కుమార్కు తెలియజేయగానే రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు.
ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ నేటి సమాజానికి సంతోష్ కుమార్ ఆదర్శమని రక్తదానం చేయడం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. రక్తదానం చేసిన రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్, రామోజీ శ్రీనివాస్, ఆశన్న, మహేష్ గౌడ్, నారాయణ పాల్గొన్నారు.