కామారెడ్డి, అక్టోబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో కాన్షీరాం వర్ధంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించినట్టు జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ బహుజనుల ఐక్యత కోసం పోరాడిన ఆశాజ్యోతి కాన్షీరాం అని, సామాజిక ఉద్యమ పితామహుడు అన్నారు. జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, అంబేద్కర్ల ప్రబోధాలను రాజ్యాధికారం వైపు నడిపి కాన్షీరాం విజయాలు సాధించాలని అన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు కొమ్మ రాజుల శ్రీనివాస్, మోతే లావణ్య, కమ్మరి అశోక్, ఉదయ్, మధు తదితరులు పాల్గొన్నారు.