దళితుల భూమి సమస్య పరిష్కరించాలి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెర్కిట్‌కు చెందిన సుంకరి భూమన్న, పిప్రికి చెందిన యెన్న నడిపి గంగారం, యెన్న చిన్న గంగారంల భూమి సమస్యను పరిష్కరించాలనే డిమాండుతో దళిత బహుజన ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భాదిత కుటుంబాలతో రెండు రోజుల నిరాహార దీక్షలో భాగంగా మొదటి రోజు న దీక్షను జేఏసీ చైర్మన్‌ సావెల్‌ గంగాధర్‌ దీక్షలో కుర్చున్న భాదిత కుటుంబాలకు పూల మాలలు వేసి నిరాహార దీక్ష ప్రారంభించారు.

ఈ సందర్భంగా జేఏసీ నేతలు ప్రభాకర్‌, గట్టు మాణిక్యం, దేవారాం, బీజేపీ దళిత మోర్చా నేత నల్ల రాజారాం మాట్లాడుతూ పెర్కిట్‌కు చెందిన సుంకరి భూమన్న సర్వే నెంబరు 375/11 లో రెండు ఎకరాలలో గత నలబై సంవత్సరాలుగ కబ్జాలొ ఉన్నాడని కానీ 92-93 కాలంలో చట్ట విరుద్దంగా ఎలాంటి నోటీసు లేకుండా పహాణీ నుండి భూమన్న పేరును తొలగించారని అంతే కాకుండా ఒక ఫేక్‌ ఫ్రీడం పైటర్‌ సర్టిఫికెట్‌తో రేఖ అన్నవ్వ పేరు మీద 5 ఎకరాలు ఇచ్చారని అన్నారు.

అట్లాగే పిప్రి గ్రామంలో యెన్న నడ్పి గంగారం, యెన్న చిన్న గంగారంలకు చెందిన సర్వే నెంబరు 584/ఆ,585/ఆ,585/ఈ,586/ఉ లలో గల 2-39 గుంటల భూమిని వారికి తెలియకుండానే గడ్డం భూదేవి భర్త భోజన్నల పేరు మీద అక్రమ పట్టా మార్పిడి చేశారని అన్నారు. ఫేక్‌ ఫ్రీడం పైటర్‌కు కేటాయించిన భూమిని రద్దు చేసి సుంకరి భూమన్నకు పట్టా చేసి ఇవ్వాలని అట్లాగే యెన్న నడిపి గంగారం, యెన్న నడిపి చిన్న గంగారంల భూమికి చేసిన అక్రమ పట్టా మార్పిడి రద్దు చేసి వారి పేరుపై పట్టా చేయాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో భాదిత కుటుంబాలతో పాటు దళిత బహుజన ప్రజా సంఘాల జేఏసీ నేతలు రాజేశ్వర్‌, పివైఎల్‌ రాష్ట్ర నాయకులు సుమన్‌, ఏఐకెఎంఎస్‌ అధ్యక్ష,కార్యదర్శులు ఏపీ గంగారాం, రాజన్న, పిడిఎస్‌యు అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌, పివైఎల్‌ నాయకులు మనోజ్‌, రాజ్‌, మహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »