కామారెడ్డి, అక్టోబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డిలో మంగళవారం ఇంటింటికి తిరుగుతూ వైద్య సిబ్బంది కొవిడ్ వ్యాక్సినేషన్ చేశారు. వ్యాక్సినేషన్ వేయించుకొని ఓ కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చర్చించి వ్యాక్సినేషన్ వేయించుకునే విధంగా అవగాహన కల్పించారు. వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
కుటుంబంలోని ఐదుగురికి వ్యాక్సిన్ వేయించారు. 95 ఏళ్ల వృద్ధురాలు అఫీజాబేగంకు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. కొవిడ్ రాకుండా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఎల్లారెడ్డి మండలం మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు.
వ్యాక్సినేషన్, మందుల వివరాలు వైద్యుడు వెంకట స్వామిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. వ్యాక్సినేషన్ వారం రోజుల్లో 100 శాతం పూర్తిచేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకొని ప్రజలకు అవగాహన కల్పించి వేయించుకునే విధంగా చూడాలని కోరారు. ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో ధరణిలో పెండిరగ్ ఫైళ్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఫైలు పెండిరగ్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వో శోభారాణి, ఎంపీపీ మాధవి, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, సర్పంచ్ అశోక్ రెడ్డి, ఎంపీడీవో మల్లికార్జున్ రెడ్డి, వైద్యుడు క్రాంతికుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.