కామారెడ్డి, అక్టోబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్ వ్యాక్సినేషన్ పై ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపుర, బీసీ కాలనిలో వైద్య శాఖ ఆధ్వర్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది మంగళవారం ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ చేశారు.
వ్యాక్సినేషన్ వేయించుకొని వారింటికి వెళ్లి కలెక్టర్ వారితో చర్చించి వ్యాక్సినేషన్ వేయించుకునే విధంగా అవగాహన కల్పించారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వ్యక్తులకు సన్మానం చేశారు. వ్యాక్సినేషన్ చేయించుకుంటే కరోనా దరిచేరదని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు.
సమీకృత మార్కెట్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్, ఆర్డీవో రాజా గౌడ్, కమిషనర్ రమేష్ కుమార్, డిప్యూటీ డిఎంఅండ్హెచ్‌ఓ మోహన్ బాబు, వైద్యులు, వైద్య సిబ్బంది, మెప్మా సి ఆర్‌పిలు పాల్గొన్నారు.