సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగా పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణలో ఉందన్నారు.. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. తొమ్మిది రోజుల పాటు తీరొక్క పువ్వుతో బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకున్న ఆడబిడ్డలందరికి శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వ బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ పండుగను ప్రజలందరు వేడుకగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువులు, నీటి కుంటల వద్ద జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేశారు. బతుకమ్మ పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »