బోధన్, అక్టోబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరుగాలం కష్ట పడి పండిరచిన పంటలకు ప్రభుత్వం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో ప్రయివేట్ దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్ట పోతున్నారని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసి బోధన్ డివిజన్ కార్యదర్శి కే. గంగాధర్ అన్నారు.
తుపాన్ మూలంగా భారీగా కురిసిన వర్షాలతో పంటలన్ని నీట మునిగాయని అలా నష్టపోయిన రైతులు పంటను నూర్పిడి చేసి అమ్ముకుందామంటే, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక తుట్టికి పావుషేరుకు అమ్ముకొని నష్టాల పాలవుతున్నారని కె.గంగాధర్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్ధతు ధర చెల్లించి, కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బోధన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు పడాల శంకర్, నరేందర్ పాల్గొన్నారు.