కామారెడ్డి, అక్టోబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి వైద్యశాఖ, ఎంపీవోలతో టెలి కాన్ఫరెన్సులో మాట్లాడారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు.
వైద్య సిబ్బందికి, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు సహకారం అందించాలని కోరారు. మండల స్థాయి అధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఆరోగ్య కార్యకర్తల లక్ష్యాలను పూర్తిచేసే విధంగా చూడాలన్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉంటే వారికి అవగాహన కల్పించి వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ చేయాలని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్సులో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, వైద్యాధికారులు పాల్గొన్నారు.